Welcome Dear Guest
User ID: Password:
Email:
Telugudukanam Header
Magazine Books VCDS ACDS Games Gifts New Oder FAQ English Version

స్వాగతం! సుస్వాగతం!!

తెలుగు బిడ్డలందరికీ మన తెలుగు దుకాణంకు స్వాగతం.

ముందుగా, తెలుగుదనం.కో.ఇన్ కు మీనుండి అందుతున్న ఆదరణకు ధన్యవాదములు.

నా పేరు వలివేటి మురళీ కృష్ణ. నేనుండేది ఆంధ్ర ప్రదేశ్‌లోని చీరాలలో. చదువు కోసమైతేనేమీ, ఉద్యోగరీత్యానైతేనేమీ, దాదాపు పదిహేడు సంవత్సరాలు తెలుగు నేలకు బయట వుండవలసి వచ్చింది. ఎక్కువకాలం విదేశాలలో వున్నాను. అప్పట్లో అందరు ప్రవాసాంధ్రుల మాదిరే నా పరిస్థితీ. మా ఆవిడకోసం, మా పిల్లల కోసం, నా కోసం మన తెలుగు పాటలు, సినిమాలు, పత్రికలు, పుస్తకాలు, ఇలా ఏవి కావాలన్నా దొరికేవి కావు. కొనుక్కోగల స్తోమత వున్నా, అవసరమైనవి అందుబాటులో లేక ఏదో కోల్పోయామని కొంచెం అనిపించేది. పండుగలు, ఇంట్లో వస్తుండే సందర్భాలలో కావలసిన వస్తువులుగాని, లిటరేచర్ కానీ, సమయానికి దొరకక, మన వాళ్ళకీ, మన నేలకీ దూరంగా బయట వున్నామని గుర్తుకొస్తుండేది. మన దేశం తిరిగి వెళ్ళిన తరువాత ఈ విషయంలో కొంత కృషి చేయాలనేది ఒక గట్టి కోరికగా తయారయింది.

2006 నవంబరు ఒకటో తారీఖున "తెలుగుదనం" అనే ఒక తెలుగు వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించాము. క్రమం తప్పకుండా, ప్రతి వారం దాంట్లో క్రొత్త విషయాలు చేరుస్తూ వున్నాము. తరువాత, చీరాలనుండే "తెలుగు దుకాణం" అనే వెబ్‌సైటును చేపట్టి, తెలుగు వారి అవసరానికి అందుబాటులో వుండేటట్లుగా, మా వూరిలో పదిమందికి ఉపాధి కలిగేటట్లుగా, 2007 మార్చి 20, ఉగాది పర్వదినాన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.

చీరాలలో దొరికే 50 తెలుగు పత్రికలు, 30 ఇంగ్లిష్ పత్రికలతో, అలానే వందలకొద్దీ సినిమా సీడీలతో దుకాణం తలుపులు తెరిచాము. పదిహేడు కొనుగోళ్ళతో మొదటి రోజునే అందిన శ్రేయోభిలాషుల ప్రోత్సాహం అభినందనీయం. ప్రతివారం బోలెడన్ని క్రొత్త సినిమా సీడీలు, డీవీడీలు, పాటల సీడీలు, చక్కటి తెలుగు పుస్తకాలు, పిల్లల ఆట వస్తువులు, మంచి చదువుకు తోడ్పడే ఒనరులు, అయినవారికి ప్రేమతో అందజేయడానికి ఉపయోగపడే బహుమతులు, ఇలా ఎన్నో అందుబాటులోకి తెస్తున్నాము.

తెలుగు దుకాణం ప్రత్యేకతలివీ...

1. తెలుగు భాషలో సేవలందించడం (తెలుగు యూజర్ ఇంటర్‌ఫేస్)

2. సంపూర్ణమైన వస్తు సేకరణ (కాంప్రహెన్సివ్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో)

3. మంచి వస్తువులను మాత్రమే అందజేయడం (ప్రోడక్ట్ క్వాలిటీ)

4. వీలైనంత తక్కువ ధరకు అందజేయడం (ప్రోడక్ట్ కాస్ట్)

5. అత్యున్నతమైన సేవ అందజేయడం (సర్వీస్ క్వాలిటీ)

తెలుగుదనం విషయంలో గానీ, తెలుగు దుకాణం విషయంలో గానీ, నేనెప్పుడూ ఒకటే కొలమానం చెప్తూ వుంటాను, 'పెద్దగా చదువుకోని, అసలు ఇంగ్లిష్ భాషే రాని మా తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకోగలగాలి' అని. 'తెలుగు భాషతో గానీ, తెలుగు నేలతో గానీ ముడిపడిన వస్తువులన్నిటినీ అందుబాటులోకి తేవాలి' అని. అలానే, నా స్వానుభవంతో చెప్పే ఇంకో మాట. 'డబ్బులు పంపించామే, వస్తువులు అందుతాయా, లేదా? ఎప్పటికి వస్తాయో?' లాంటివి ఇంటర్నెట్ ద్వారా వస్తువు కొనుక్కునేటప్పుడు వుండే సహజమైన బెంగలు. అటువంటివి మనసుని కలవర పరచకుండా అడుగడుగునా సమాచారాన్ని అందజేస్తూ, మీరు మళ్ళీ ఇక్కడికే వచ్చేటట్లు, ఈ దుకాణం గురించి మరో నలుగురికి మంచిగా చెప్పేటట్లుగా మా సేవ అత్యున్నతంగా, తెలుగు దుకాణం కుటుంబమంతా గర్వంగా చెప్పుకునే రీతిలో వుండాలనేది నా అభిలాష.

సరే, ఇక మాటలు ఆపి, మిగిలినవి సేవ ద్వారా తెలియజేస్తాం. "గీతా" మా అనుబంధ సంస్థ. గీతా బృందమే తెలుగు దుకాణం బృందం కూడా. మా అందరి వివరములు క్రింద ఇచ్చాము. సంతోషంగా సంప్రదించండి.

"తెలుగు దుకాణం" ఒక వ్యాపార సంస్థ అయినా, 15 కోట్ల తెలుగు బిడ్డలకు అందుబాటులోకి తెచ్చిన సేవ కూడా అని నా వుద్దేశ్యం. కోటికి ఒక తెలుగు సైటు కూడా లేని ఈ పరిస్థితిలో 'తెలుగు దుకాణం' అందరికీ ఎంతో కొంత వుపయోగపడుతుందనీ, అందరినీ సంతోషపరుస్తుందనీ ఆశిస్తూ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.

"తెలుగు దుకాణం" సందర్శించినందుకు ధన్యవాదములు.



ఇట్లు,

సహచరులతో కలిసి
మురళీ కృష్ణ వలివేటి


మేనేజింగ్ డైరెక్టర్

తెలుగుదుకాణం.కో.ఇన్

తెలుగుదనం.కో.ఇన్

గీతా.కో.ఇన్

వికాం నెట్.కో.ఇన్




తెలుగు దుకాణం బృందం

కేరాఫ్ గీతా,

13-5-15, వి.యం.గాంధీ బిల్డింగ్స్,

వీర రాఘవ పేట,

చీరాల - 523155,

ప్రకాశం జిల్లా,

ఆంధ్ర ప్రదేశ్.

(+91) (8594) 220022.

ఈ మెయిల్: reception@geta.co.in


>
     
మురళీకృష్ణ వలివేటి జయశ్రీ వలివేటి కిరణ్ నందమూడి సునీల్‌బాబు వాసె

మురళీకృష్ణ వలివేటి, ఎం.టెక్.
+91-98856-19996
murali.valiveti@geta.co.in

జయశ్రీ వలివేటి, బి.ఏ.
+91-98856-04446
jayasri.valiveti@geta.co.in

కిరణ్ నందమూడి, డి.ఇ.ఇ.ఇ.
+91-99855-92223
kiran.nandamudi@geta.co.in

సునీల్‌బాబు వాసె, (బి.ఏ.)
+91-92937-28736
sunil.vase@geta.co.in

ప్రశాంతి చీమకుర్తి      

ప్రశాంతి చీమకుర్తి,బి.టెక్.
+91-80192-50081
santhi.cheemakurthy@geta.co.in

    
Home About Us www.telugudukanam.co.in www.vcomnet.co.in mailto:webmaster@telugudukanam.co.in For Unicode Text Display